British Pop Singer | గ్రామీ అవార్డు విన్నర్, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను కలిగిన బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్ (ఎడ్ షీరాన్) భారతీయ సంగీత ప్రపంచంపై మక్కువ చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల భారతదేశంలో భారీ కాన్సర్ట్ టూర్‌ను పూర్తి చేసిన ఆయన ఈ టూర్ సందర్భంగా భారత సంస్కృతి, స్థానిక సంగీత శైలులపై లోతైన ఆసక్తి చూపారు. ఈ క్రమంలోనే తన తొలి ఇండియన్ కోలాబరేషన్గా ‘సఫైర్’ (Sapphire) అనే ఆల్బమ్‌ను విడుదల చేసి బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌తో పాటు ప్రముఖ ఇండియన్ సింగర్ అర్జీత్ సింగ్‌ను ఫీచర్ చేశారు. ఈ ఆల్బమ్ భారత్‌లోనే చిత్రీకరించబడి వెస్టర్న్ పాప్‌ను పంజాబీ ఫోక్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు ఎడ్ షీరాన్ మరోసారి ఇండియన్ సినిమా రంగంలోకి ప్రవేశిస్తూ ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్‌తో కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తుంది.
సంతోష్ నారాయణన్ ప్రస్తుతం ఒక తమిళ ఆల్బమ్ కోసం పనిచేస్తుండగా ఈ సినిమాలో ఒక పాటను ఎడ్ షీరాన్ అలాగే తన కూతురు ‘ఢీ’తో పాడించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాటలో ర్యాపర్ హనమాన్కైండ్ కూడా భాగం కాబోతున్నట్లు సమాచారం. సంతోష్ నారాయణ్ కంపోజ్ చేస్తున్న ఈ ట్రాక్ తమిళ సినిమా ట్రెడిషనల్ ఎలిమెంట్స్‌ను వెస్టర్న్ పాప్‌తో ఫ్యూజ్ చేసి గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుందని టాక్ నడుస్తుంది.