Ileana | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డి క్రూస్ ప్రస్తుతం సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంతోనే వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె తన భర్త మైఖేల్ డోలన్‌తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తొలి సంతానం కోవా ఫీనిక్స్ డోలన్ తరువాత, ఇటీవల ‘కీను రాఫే డోలన్’కు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో నివసిస్తూ, భర్త మైఖేల్ డోలన్‌తో కలిసి పిల్లల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. అయితే ముంబయిని చాలా మిస్ అవుతున్నానని, అక్కడి స్నేహితులు ఇచ్చిన మద్దతు, మానసిక బలం ఇప్పటికీ గుర్తు వస్తోందని ఆమె తెలిపింది.వృత్తిపరంగా ఇలియానా చివరిసారి 2024లో విడుదలైన హిందీ సినిమా ‘దో ఔర్ దో ప్యార్’ లో కనిపించారు. ఈ చిత్రంలో విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఇలియానా కొత్త ప్రాజెక్ట్‌లను ఇంకా సైన్ చేయలేదు.
ప్రస్తుతం నా ప్రాధాన్యం పిల్లల పెంపకమే. వాళ్లు కొంచెం పెద్దవాళ్లు అయిన తర్వాతే కెరీర్‌పై మళ్లీ దృష్టి పెడతాను, అని ఇలియానా ఓ సందర్భంలో అన్నారు. 2023లో మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకున్న ఆమె, ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా సంతోషంగా ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నారు. “తన కుటుంబంతో గడిపే ప్రతి క్షణం ప్రత్యేకం. మాతృత్వంలో దొరికే ఆనందం మరే ఇతర అనుభవంతో పోల్చలేనిది,” అని ఇలియానా స్పష్టం చేసింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా తాజాగా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఇందులో బేబి బంప్‌తో కనిపిస్తూ. ఊయల సర్ధుతూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. అలాగే నా కొత్త ప్రాణ స్నేహితుడు రాబోతున్నాడని రాసుకొచ్చింది. దీంతో ఆమె మళ్లీ ప్రగ్నెంట్ అని త్వరలో మరో బేబికి జన్మనివ్వబోతుందంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలియానా తన రెండో గర్భధారణ అనుభవాలను పంచుకున్నారు. “మొదటి బిడ్డ పుట్టినప్పుడు ప్రతి మార్పుని అంగీకరించడానికి ప్రయత్నించాను. కానీ అకస్మాత్తుగా జీవితమంతా మారిపోయినట్టు అనిపించింది. బిడ్డ ఆరోగ్యంపై, సంరక్షణపై పూర్తిగా దృష్టి పెట్టాల్సి వచ్చింది,” అని ఆమె చెప్పింది.“రెండో గర్భధారణ సమయంలో మాత్రం మానసిక స్థితి భిన్నంగా ఉండేది. కొంత గందరగోళంలో పడ్డాను. స్నేహితులు దూరంగా ఉండటం వల్ల మద్దతు లేకుండా అనిపించింది. ఒంటరిగా ఉండడం ఒక సవాలుగా మారింది,” అని ఇలియానా వెల్లడించింది.