Bison Trailer | తమిళ స్టార్ నటుడు చీయాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ (కర్ణన్, మామన్నన్ ఫేమ్) కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘బైసన్’. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న తమిళంలో విడుదల కాబోతుండగా.. తెలుగులో అక్టోబర్ 17న రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం కబడ్డీ ఆట నేపథ్యంలో రాబోతుంది. 1980ల నాటి గ్రామీణ తమిళనాడు వాతావరణంలో, కబడ్డీ ఆటగాడి జీవిత పోరాటం, అణగారిన వర్గాల కష్టాలు, సామాజిక వివక్షపై వారి తిరుగుబాటు వంటి అంశాలను దర్శకుడు మారి సెల్వరాజ్ తనదైన శైలిలో చూపించనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ఆటగాడిగా కనిపించబోతుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. పశుపతి, రజిషా విజయన్, అమీర్, లాల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.