Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Instagram Influencer Veeramani | సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవాలనే ఆశ కొందరి ప్రాణాల మీదకు తెస్తుంటుంది.
Instagram Influencer Veeramani | సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవాలనే ఆశ కొందరి ప్రాణాల మీదకు తెస్తుంటుంది. సరిగ్గా ఇలాంటి వింత అనుభవమే తమిళనాడులోని మదురైకి చెందిన వీరమణి అనే ఇన్స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఎదురైంది. సోషల్ మీడియాలో చేసిన ఒక చిన్న సరదా కోరిక అతని జీవితంలో పెద్ద తలనొప్పిగా మారింది.
రాబోయే దీపావళి పండుగ సందర్భంగా.. తనకు ఎవరైనా సరే ఒక స్వీట్ బాక్స్ పంపాలని కోరుతూ వీరమణి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా, ఆ వీడియోలో తన ఇంటి పూర్తి అడ్రస్‌తో పాటు తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను కూడా పబ్లిక్‌గా షేర్ చేశారు.
ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు నిజంగానే స్వీట్లు పంపినా, మరికొందరు ఆ అడ్రస్‌ను దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. క్యాష్ ఆన్ డెలివరీ (COD) పద్ధతిలో ఆయన పేరు మీద పెద్ద ఎత్తున వస్తువులను ఆర్డర్ చేయడం ప్రారంభించారు. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ఫోన్లతో పాటు ఏకంగా రూ. 1.69 లక్షల విలువైన భారీ టీవీని కూడా COD ఆర్డర్ పెట్టడంతో వీరమణి షాక్ అయ్యారు. అయితే ఇక్కడితో ఆగకుండా, ఒక ఆకతాయి ఏకంగా రూ. 70 కోట్ల విలువైన మిలిటరీ ట్యాంక్‌ను ఆయన అడ్రస్‌కు COD పద్ధతిలో ఆర్డర్ చేశాడు. ఈ భారీ ఆర్డర్లు చూసి లబోదిబోమన్న వీరమణి.. దయచేసి తన అడ్రస్‌పై ఎలాంటి ఆర్డర్లు పంపొద్దని సోషల్ మీడియా వేదికగా అందరినీ వేడుకున్నారు.
అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఆయన ఇంటికి కొరియర్లు, డెలివరీలు రావడం నిరంతరం కొనసాగడంతో మానసిక వేదనకు గురయ్యారు. ఈ వేధింపులు భరించలేక చివరికి ఆ ఇన్ఫ్లుయెన్సర్ తన ప్రస్తుత ఇంటిని ఖాళీ చేసి, వేరే ప్రాంతానికి మకాం మార్చాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకునేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
He is finally vacating his house🤦🏻♂️
Veeramani Shanmuganathan, a social media personality who has been receiving a flood of unwanted cash-on-delivery orders such as Millitary Tanker worth ₹70 crores, ambulance, television, refrigerator etc. He even received calls from police regarding this daze situation. His followers deliberately placed fake orders as a joke or entertainment which ended up harassing him.
The most troubling aspect is that the consequence of a fake order affects the delivery partners who work tireless and travel long distances to deliver the products. As a result of all these agitation, he is now forced to vacate his home where he lived for years.
This incident serves as a reminder that digital harassment can have very real consequences offline. What may begin as an online feud can affect a person’s privacy, peace of mind and sense of security
— Deepu (@deepu_drops) October 10, 2026
An influencer asked Instagram for Deepavali sweets.
The internet said, “Sure!” and ordered battle tanks, TVs, fridges… all on COD. 😂
Man has now caught a bus and left town. 🚌💨
🎥 : IG/veeramani https://t.co/hwP2TtGvVv
— Bengaluru Post (@bengalurupost1) October 13, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

