Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Saluru | మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ టీడీపీ యువ నేత, రిజర్వేషన్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే తను ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Saluru | రాజకీయాల్లో పదవుల కోసం ఎత్తుగడలు వేయడం సహజం. కానీ మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ టీడీపీ యువ నేత, రిజర్వేషన్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే తను ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
సాలూరు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయిస్తూ సోమవారం రిజర్వేషన్ ఖరారైంది. దీంతో ఈ పదవిని ఆశించిన పలువురు పురుష నేతలకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ తన రాజకీయ భవిష్యత్తుపై కొత్తగా ఆలోచించాడు. తాను నేరుగా పోటీలో నిలిచే అవకాశం లేకపోవడంతో, తన భార్యను బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన అమ్మాయిని ఉన్నఫళంగా పెళ్లి చేసుకున్నాడు.

Saluru Tdp Love Marriage1
ఎనిమిదేళ్ల ప్రేమ.. ఒక్క రోజులో పెళ్లి!
వైకుంఠపు హర్షవర్దన్.. గుళ్ల మంజీరా ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మరో ఆరు నెలల తర్వాత వివాహం చేసుకోవాలని తొలుత నిర్ణయించుకున్న ఈ జంట.. రిజర్వేషన్ ప్రకటన తర్వాత అనూహ్యంగా పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి మంగళవారం సాలూరులోని స్థానిక ఆలయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటివరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయంగా కనిపించిన ఈ వివాహం, మున్సిపల్ ఛైర్పర్సన్ రిజర్వేషన్ ప్రకటనతో ముడిపడి ఉండటంతో రాజకీయంగా చర్చ మొదలైంది. పదవి కోసం పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
భార్యను రాజకీయ బరిలోకి దింపే యోచన?
సాలూరు మున్సిపాలిటీలో 32 వార్డులు ఉన్నాయి. ఈసారి ఛైర్పర్సన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనున్న నేపథ్యంలో ఆశావహులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో హర్షవర్ధన్ తన భార్య మంజీరాకు టీడీపీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ అధిష్ఠానం ఆమె అభ్యర్థిత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కాగా, హర్షవర్ధన్ 2019లో టీడీపీ తరఫున కౌన్సిలర్‌గా గెలిచారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విధేయుడిగా ఆయనకు స్థానిక రాజకీయాల్లో గుర్తింపు ఉందని చెబుతున్నారు. ఆయన తండ్రి వైకుంఠపు పంచముఖి కూడా గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఈ రాజకీయ నేపథ్యం, స్థానికంగా ఉన్న మద్దతు ఆయన కుటుంబానికి అనుకూలంగా మారుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

