Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Shikhar Dhawan: వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు అనుమతి లేకుండానే తన పేరును వాడినట్లు మాజీ టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఆరోపించారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ బృందం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ: వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు అనుమతి లేకుండానే తన పేరును వాడినట్లు మాజీ టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) ఆరోపించారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ బృందం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఎక్స్ అకౌంట్లో ధావన్ స్పందిస్తూ.. తనకు తెలియకుండానే, తన అనుమతి లేకుండానే, తన పేరును నిర్వాహకులు వాడినట్లు ధావన్ చెప్పారు. అనధికార ప్రకటనలకు మీడియా కానీ, అభిమానులు కానీ స్పందించరాదు అని ఆయన కోరారు. భారత జట్టు తరపున క్రికెట్ ధావన్ అన్ని ఫార్మాట్లలో ఆడాడు. కానీ వన్డేలు అతని ఫెవరేట్. అతను 167 వన్డేలు ఆడాడు. 44.1 యావరేజ్తో 6793 రన్స్ చేశాడతను. దాంట్లో 17 సెంచరీలు, 39 ఫిఫ్టీలు ఉన్నాయి. ఇక టెస్టుల్లో ధావన్ 34 మ్యాచ్లు ఆడి 40.6 సగటుతో 2315 రన్స్ చేశాడు. టెస్టుల్లో అతను ఏడు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. టీ20ల్లో 68 మ్యాచ్లు ఆడిన అతను 27.9 సగటుతో 1759 రన్స్ చేశాడు. వీటిల్లో 11 అర్థశతకాలు బాదాడు.
I have come across my name as a participant in the World T20 Continent Cup. My name has been used by the organisers without my knowledge or permission, and my team will be taking the appropriate legal steps to address this.
I request the media and my fans to not report or rely on any unauthorised announcements. Thank you for your continued love and support. 🙏
— Shikhar Dhawan (@SDhawan25) October 13, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

