Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
Yogita Rana | అజ్ఞానమనే చీకటిని విద్య తొలగించి మానవ జీవితాల్లో జ్ఞానం, ఆత్మవిశ్వాసం వెలిగిస్తుందని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా పేర్కొన్నారు.
హైదరాబాద్ : అజ్ఞానమనే చీకటిని విద్య ( Education ) తొలగించి మానవ జీవితాల్లో జ్ఞానం, ఆత్మవిశ్వాసం వెలిగిస్తుందని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా ( Yogita Rana ) పేర్కొన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) సహకారంతో ఖైదీల కోసం ఓపెన్ స్కూలింగ్ ( Open Schooling ) కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
ఆమె మాట్లాడుతూ మానవ జీవితంలో విద్య యొక్క ప్రాముఖ్యతను, శక్తిని వివరించారు. విద్య అనేది కేవలం జ్ఞానాన్ని, విద్యార్హతలను మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ చదువును కొనసాగిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఖైదీలకు విద్యను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో జైళ్లలో ప్రత్యేక టాస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, తద్వారా వారికి అవసరమైన విద్యా సహాయం , బోధనా సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. ఖైదీలు విద్యను అభ్యసించేందుకు ప్రోత్సాహకంగా ప్రతి ఖైదీకి కోర్సు ఫీజులో రూ.1,250 రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) సమాచార బ్రోచర్లను అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీ కె. లింగయ్య , అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

