Sound Pollution | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వాహనాలు చేసే పెద్ద శబ్దాలు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని డెన్మార్క్ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. వాహన శబ్దాల కారణంగా 37 ఏండ్లు పైబడిన పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
శబ్ద కాలుష్యం కారణంగా 35 ఏండ్లు పైబడిన మహిళల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం పడుతున్నట్టు వెల్లడించారు. దీనికి గల శాస్త్రీయ కారణాలపై లోతైన పరిశోధనలు చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ రద్దీ సమయాల్లో వచ్చే పెద్ద శబ్దాల వల్ల మనుషుల్లో రక్తపోటు పెరుగుతున్నట్టు యూకే పరిశోధకులు తెలిపారు.
ప్రపంచంలోనే ఇప్పటివరకు ఉన్న వాటిల్లో అతిపెద్దదైన అంబర్ శిలాజాన్ని రొమేనియాలో విచిత్రమైన పరిస్థితిలో గుర్తించారు. చెట్ల నుంచి వెలువడే ఒక రకమైన స్రావం గట్టిపడి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత అంబర్ శిలాజంగా ఏర్పడుతుంది.దాదాపు 3.8 నుంచి 7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఎర్రటి రాయి(అంబర్ శిలాజం) రొమేనియాలోని కోల్టి అనే గ్రామానికి చెందిన ఓ బామ్మకు దొరికింది. సుమారుగా 3.5 కిలోలున్న ఈ రాయిని గుమ్మం ముందు మెట్టుగా ఆమె కొన్నేండ్లపాటు వాడింది. ఆమె ఇంట్లో చోరీకి వచ్చిన దొంగలు సైతం దాని ప్రత్యేకతను గుర్తించలేకపోయారు. చివరికి ఆ బామ్మ తరఫు బంధువు ఒకరు దానిని గుర్తించారు. దాని విలువ రూ.9.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.