‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా పథకం అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో...
– ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్, నవంబర్ 20 : ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా పథకం అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో సర్పంచ్ బాణోతు నరసింహ, ఎంపీడీవో జమలారెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా పథకాన్ని జిల్లా పంచాయతీ అధికారి అనూష, జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. తొలుత లబ్దిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించి అనంతరం ఇంటింటి జీవిత బీమా పథకం పత్రాలను లబ్దిదారులకు ఆయన స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కేఆర్ కే ప్రసాద్, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆయా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో శుక్రవారం మార్కెట్‌యార్డులో ఘనంగా జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తోలెం కల్యాణి, వైస్ చైర్మన్ కాకా రాములుతో పాటు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాభివృద్దే ప్రధాన లక్ష్యంగా నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
సారపాకలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

