భారతదేశ జనాభా 2025లో 146 కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచిందని యూఎన్ డెమోగ్రఫిక్ రిపోర్టు వెల్లడించింది. అయితే భారత్లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతున్నదని తెలిపింది. యూనైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ పాపులేషన్ రిపోర్ట్(ఎస్వోడబ్ల్యూపీ)-2025 నివేదిక జనాభా విషయంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించింది.
దేశంలో సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయింది. 1961లో భారత్ మహిళలు సగటున ఆరుగురికి జన్మనిచ్చేవారు. ప్రస్తుతం ఒకరిద్దరితో సరిపెడుతున్నారు. దీంతో దేశంలో మరణాల రేటు కంటే జననాల రేటు తక్కువగా ఉంది.
65 ఏండ్ల పైబడి
15-64 ఏండ్లు68%
(పనిచేసే సామర్థ్యం గల జనాభా)
0-14 ఏండ్లు24%10-19 ఏండ్లు ; 17%
10-24 ఏండ్లు ; 26%