వ్య్రవస్థాపకుడిపై భారత్‌పే వేటు
- ఎండీ, డైరెక్టర్ హోదాల నుంచి అష్నీర్ గ్రోవర్‌ను తొలగించిన బోర్డు
- ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణ
న్యూఢిల్లీ, మార్చి 2: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్‌పై కంపెనీ వేటువేసింది. పలు ఆరోపణల నేపథ్యంలో గ్రోవర్‌ను అన్ని హోదాల నుంచి తొలగించినట్టు భారత్‌పే బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొం ది. గ్రోవర్‌పై మరిన్ని చట్టపరమైన చర్యల్ని తీసుకోవడంతో పాటు ఆయనవద్దనున్న కొంత వాటాను కూడా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. క్యూఆర్ కోడ్స్ ద్వారా డిజిటల్ చెల్లింపుల కోసం దుకాణదారులకు వీలుకల్పించే భారత్‌పే పది రోజుల క్రితమే అష్నీర్ గ్రోవర్ సతీమణి మాధురి జైన్ గ్రోవర్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణపై ఉద్వాసన పలికింది. మాధురి సంస్థ కంట్రోల్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ సొమ్మును బ్యూటీ ట్రీట్మెంట్లు, విదేశీ టూర్లకు ఖర్చుచేసి, నకిలీ ఇన్వాయిస్లు సమర్పించాన్నది కంపెనీ ప్రధాన ఆరోపణ. అలాగే కొటక్ మహీంద్రా బ్యాంక్ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే అష్నీర్ గ్రోవర్‌ను కంపెనీ బోర్డు మూడు నెలల సెలవుపై పంపించింది. తాజాగా ఆయనకు పూర్తిగా గుడ్‌బై చెప్పింది. వాస్తవానికి కంపెనీ బోర్డు సమావేశపు అజెండా అందినవెంటనే గ్రోవర్ తన పదవులకు రాజీనామా చేశారని కంపెనీ ప్రకటన వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి దాటేంతవరకూ జరిగిన బోర్డు సమావేశంలో గ్రోవర్ వ్యవహారశైలిపై అందిన ఆడిట్ రిపోర్ట్‌ను చర్చిం చి, ఉద్వాసన పలకాలని డైరెక్టర్లు నిర్ణయించారు. గ్రోవర్ కుటుం బం, బంధువులు విలాసాల కోసం కంపెనీ నిధుల్ని దుర్వినియోగం చేశారని, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి, కంపెనీ ఖర్చుల్లో చూపించారని భారత్ పే ఆరోపించింది. బోర్డు, మెజారిటీ ఇన్వెస్టర్ల ఆమోదం లేకుండా ఎండీగా రాజీనామా చేసినందున, షేర్‌హోల్డర్ల ఒప్పందం ప్రకారం ఆయన నుంచి 1.4 శాతం వాటాను స్వాధీనపర్చుకోనున్నట్టు వివరించింది.
పమోటర్లలో లుకలుకలు
భారత్ పేను స్థాపించిన ప్రమోటర్ల మధ్య కొద్దినెలలుగా లుకలుకలు మొదలయ్యాయి. కంపెనీ ప్రస్తుత సీఈవో సమీర్ సుహైల్‌పై తనకు విశ్వాసం లేదని అష్నీర్ గ్రోవర్ విరుచుకుపడుతుండగా, మరో వ్యవస్థాపకుడైన శాశ్వత్ నక్రాని..సీఈవోకు మద్దతు పలుకుతున్నారు. తనవద్దనున్న 9.5 శాతం వాటాను రూ. 4,000 కోట్లకు ఎవరైనా ఇన్వెస్టరు కొంటేనే తాను కంపెనీ నుంచి వైదొలుగుతానంటూ గ్రోవర్ చెపుతున్నారు. శాశ్వత్ నక్రానికి 7.8 శాతం వాటా ఉన్నది. పీఈ ఫండ్ సెక్యూయా క్యాపిటల్ 19.6 శాతం వాటాతో కంపెనీలో మెజారిటీ షేర్‌హోల్డరుగా ఉంది. ఇతర పీఈ ఫండ్స్ కోట్యూకు 12.4 శాతం, రిబ్బిట్ క్యాపిటల్‌కు 11 శాతం చొప్పున వాటా ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

