Towel Dance | విదేశాల్లో భారతీయ పర్యాటకుల ప్రవర్తనపై మరోసారి సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. ఇటీవల వియత్నాం ఎయిర్‌పోర్టు రన్‌వేపై డ్యాన్స్‌లు చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో విమర్శలు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలు మరువకముందే ఓ భారతీ యువతి.. విదేశాల్లోని రద్దీగా ఉండే వీధుల్లో రాత్రిపూట టవల్ కట్టుకుని డ్యాన్స్ చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది.
సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఓ యువతి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా దిల్వాలే దుల్హనియా లే జాయెంగే లోని ప్రముఖ గీతం మేరు ఖ్వాబోన్ మే పాటకు డ్యాన్స్ చేసింది. అయితే ఆ సమయంలో తెల్లటి టవల్‌ను మాత్రమే చుట్టుకుంది. రద్దీగా ఉండే నైట్ మార్కెట్లో డ్యాన్స్ చేయడమే కాకుండా.. డ్యాన్స్‌లో భాగంగానే టవల్‌ను సరిచేసుకుంటూ హావభావాలను ప్రదర్శించింది.
ఆ యువతి టవల్‌తో డ్యాన్స్ చేస్తున్న సమయంలో నైట్ మార్కెట్ మొత్తం స్థానికులు, టూరిస్టులతో కిటకిటలాడుతుంది. ఆమె డ్యాన్స్ చేస్తుండటం చూసి షాకైన స్థానికులు నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్‌మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం ఇలా దేశ ప్రతిష్ఠను తీయడం సరికాదని చాలా మంది హితవుపలుకుతున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత బాధ్యతారాహిత్యమని.. ఇలా ఒక్కరు చేసిన పనితో భారతీయులు అందరిపైనా తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని కామెంట్లు పెట్టారు.
An Indian tourist’s viral towel dance that shows a complete lack of civic sense. pic.twitter.com/3W1QDNbiDP
— Damn. (@Theonenameddamn) June 8, 2026