హాంకాంగ్: ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ మొగలి వెంకట్రామ్రెడ్డి పసిడి పతకంతో మెరిశాడు. ఆదివారం జరిగిన పురుషుల 800మీటర్ల ఫైనల్ రేసును వెంకట్రామ్రెడ్డి 1:48:27 సెకన్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును సవరించుకున్నాడు. నెత్సరా దినేత్ లియాంగే(1:49:22సె), అత్సుకి వతనబె(1:49:29సె) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.