ఆసియా క్రీడల్లో 44 ఏండ్ల తర్వాత స్వర్ణాన్ని దక్కించుకునేందుకు భారత మహిళల హాకీ జట్టు ఒక్క అడుగుదూరంలో నిలిచింది. బుధవారం జరిగిన రెండో సెమీస్‌లో భారత్ 2-0తో దక్షిణ కొరియాను చిత్తుచేసి తుదిపోరుకు దూసుకెళ్లింది. ఇషికా చౌదరి (44వ నిమిషంలో), సారథి సలీమ టెటె (48వ) తలా ఓ గోల్ కొట్టారు. 1982లో స్వర్ణం నెగ్గాక ఈ టోర్నీలో విమెన్స్ టీమ్ మళ్లీ గోల్డ్ కొట్టలేదు. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్.. డిఫెండింగ్ చాంపియన్ చైనాతో తలపడనుంది. . స్కాష్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీస్‌కు చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకున్నాయి. టెన్నిస్‌లో సుమిత్ నగాల్ మినహా మెన్స్ డబుల్స్‌లో భారత ప్లేయర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి.