గొండా (యూపీ): డబ్ల్యూఎఫ్ఐ సీనియర్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ దీపక్ పునియా స్వర్ణంతో మెరిశాడు. సోమవారం జరిగిన పురుషుల ఫ్రీ స్టయిల్ 92 కేజీల విభాగం ఫైన్లలో దీపక్ (హర్యానా).. తన రాష్ర్టానికే చెందిన వంశ్‌ను ఓడించి టాప్ ర్యాంకింగ్‌ను దక్కించుకున్నాడు.
ఇతర విభాగాల్లో సాగర్ (57 కేజీలు), అభిషేక్ (61 కేజీలు), యష్ (74 కేజీలు), నవీన్ (79 కేజీలు) స్వర్ణాలు గెలుచుకున్నారు.