సన్యాసం తీసుకోవాలా?.. మానసికంగా కుంగిపోయి రిటైర్మెంట్ ఇచ్చేలా కుట్ర చేస్తున్నారు
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మధ్య వివాదం మరోసారి పతాక స్థాయికి చేరింది. గొండాలో జరుగుతున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పోటీ పడేందుకు వినేశ్ ప్రయత్నించగా, ఆమెపై ఉన్న అనర్హత వేటును సాకుగా చూపుతూ ఫెడరేషన్ నిరాకరించింది.
- భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌పై స్టార్ రెజ్లర్ వినేశ్ విమర్శలు
- నేషనల్ ర్యాంకింగ్ టోర్నీలో ఫొగాట్ కు అనుమతి నిరాకరణ
గొండా (యూపీ): భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మధ్య వివాదం మరోసారి పతాక స్థాయికి చేరింది. గొండాలో జరుగుతున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పోటీ పడేందుకు వినేశ్ ప్రయత్నించగా, ఆమెపై ఉన్న అనర్హత వేటును సాకుగా చూపుతూ ఫెడరేషన్ నిరాకరించింది. దీనిపై వినేశ్ తీవ్రంగా స్పందిస్తూ.. తనను మానసిక వేదనకు గురిచేసి, కుట్రపూరితంగా ఆటకు దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించింది. ‘నేను సన్యాసం తీసుకుని ఆటకు దూరంగా ఉండాలా? లేక ఓటమిని ఒప్పుకోవాలా?’ అంటూ సోమవారం ఫెడరేషన్ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌ను కలిసి తన ఆవేదన వ్యక్తం చేసింది.
జనవరి 1 నుంచే తాను పోటీలకు అర్హురాలినని అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) ధృవీకరించినప్పటికీ, జూన్ 26 వరకు తనను అనర్హురాలిగా ప్రకటించడం వెనుక కుట్ర దాగుందని వినేశ్ ఆరోపించింది. అందుకే కోర్టులు సెలవులో ఉన్న సమయంలో, టోర్నీకి కేవలం రెండు రోజుల ముందు షోకాజ్ నోటీసులు పంపారని ఆరోపించింది. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో దేశం కోసం పతకాలు సాధించిన తనను ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ అని సంబోధిస్తున్నారని, రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ మున్ముందు తనను ఉగ్రవాదిగా చిత్రించినా ఆశ్చర్యం లేదని ఆమె వాపోయింది.
తాను మానసికంగా కుంగిపోయి రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. మరోవైపు, క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు వినేశ్‌ను పోటీలకు అనుమతించబోమని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పష్టం చేశాడు. మీడియా సమావేశం అనంతరం ఆమె కనీసం ప్రాక్టీస్ చేసుకునేందుకు కూడా అధికారులు అనుమతించకపోవడంతో గొండా వేదికగా హైడ్రామా చోటుచేసుకుంది. వామప్ ఏరియాకు తాళం వేసి ఉండటం, సాయ్ సెంటర్లోనూ సౌకర్యాలు లేకపోవడంతో వినేశ్ నిరాశతో వెనుదిరిగింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, నిజాయితీగా కష్టపడుతున్నానని, తన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని వినేశ్ స్పష్టం చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

