సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. మరో యువ ఆటగాడు ఆయూష్ శెట్టితో క్వార్టర్స్ పోరులో తలపడనున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను చిత్తు చేసి క్వార్టర్స్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఏడో సీడ్ సేన్.. 21-17, 13-21, 21-13తో చి యు జెన్ (చైనీస్ తైపీ)ను ఓడించగా ఆయూష్.. 21-17, 21-16తో నాలుగో సీడ్ కొడాయ్ నరోక (జపాన్) కు షాకిచ్చాడు.
డబుల్స్ విభాగంలో సాత్విక్-చిరాగ్ ద్వయం.. 21-18, 21-11తో సు చింగ్ హెంగ్, వు గువన్ జున్ (చైనీస్ తైపీ)ను మట్టికరిపించింది. కాగా సింగిల్స్ బరిలో ఉన్న మిగిలిన షట్లర్లు మాత్రం రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టా రు. హైదరాబాదీ ఆటగాడు తరుణ మన్నెపల్లితో పాటు కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు.