New Zealand : న్యూజిలాండ్ (New Zealand) లో భారత సంతతి (Indian-origin) కి చెందిన సత్వీందర్ సింగ్ (Satvinder Singh) అనే క్యాబ్ డ్రైవర్ (Cab driver) కి ఏడేళ్లు జైలు శిక్ష పడింది. ఇతడు 2023లో ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు రుజువు కావడంతో అధికారులు జైలుశిక్ష విధించారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సత్వీందర్ సింగ్ అనే క్యాబ్ డ్రైవర్ గత 11 ఏళ్లుగా న్యూజిలాండ్‌లో ఉంటూ క్యాబ్ నడుపుతున్నాడు. 2023లో ఒక రోజు రాత్రి మైనర్ ప్రయాణికురాలు క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ఈ క్రమంలో సత్వీందర్ సింగ్ జీపీఎస్‌ను ఆఫ్ చేసి.. కారును మార్గం మళ్లించాడు. అక్కడ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత బాధితురాలిని ఆమె స్నేహితుల ఇంటి దగ్గర వదిలేశాడు. సీసీ కెమరాల ఆధారంగా సత్వీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై తాజాగా అక్కడి న్యాయస్థానం విచారణ జరిపి.. ఏడేళ్లకుపైగా జైలుశిక్ష విధించింది.