భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతున్నది. ఒమన్ వేదికగా ఈ నెలారంభంలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. శనివారం కళింగ స్టేడియంలో జరిగిన పోరులో 2-1తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన పోరులో ప్రపంచ ఆరో ర్యాంకర్ స్పెయిన్‌కు మన అమ్మాయిలు షాకిచ్చారు. భారత్ తరఫున జ్యోతి, నేహా చెరో గోల్ సాధించగా.. స్పెయిన్ తరఫున మార్టా సెగు ఏకైక గోల్ నమోదు చేసింది. ఆదివారం ఇక్కడే జరుగనున్న రెండో మ్యాచ్‌లో మరోమారు స్పెయిన్‌తో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న భారత్ తలపడనుంది. మరోవైపు పురుషుల పోరులో భారత్ 5-4తో స్పెయిన్‌పై అద్భుత విజయం సాధించింది. మూడు గోల్స్‌తో వెనుకంజలో కొనసాగిన టీమ్ఇండియా పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్‌సింగ్(15ని, 60ని), శీలానంద్ (41ని), శంషేర్‌సింగ్ (43ని), వరుణ్‌కుమార్ (55ని) గోల్స్ చేశారు.