France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
France Protests : యూరప్ దేశమైన ఫ్రాన్స్‌లో కొద్ది రోజులుగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ (ప్యారిస్)లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది.
France Protests : యూరప్ దేశమైన ఫ్రాన్స్‌లో కొద్ది రోజులుగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ (ప్యారిస్)లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌లో ఉంటున్న భారతీయులతోపాటు, ఆ దేశం పర్యటించాలనుకునే వారి క్షేమం కోసం ఈ సూచన చేసింది. భారతీయులు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే, వీలైనంత వరకు నిరసనలు, ఆందోళనలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
స్థానిక ఫ్రెంచ్ అధికారులు జారీ చేసే సూచనలను తప్పకుండా పాటించాలని కూడా సూచించింది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలిస్తున్నట్లు పేర్కొంది. భారతీయులు అప్రమత్తంగా, జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించింది. గత వారం నుంచి ఫ్రాన్స్‌లో నిరసనలు ఆందోళనకర స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, దహనం, పోలీసులపై దాడులు, దోపిడీలు వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో అనేక మంది గాయపడ్డారు.
ఫ్రాన్స్‌లో కొంతకాలంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం, నిరుద్యోగం, వైద్య సేవల్లో లోపాలు వంటి వాటిని నిరసిస్తూ ఆందోళనకారులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇదే సమయంలో ఇటలీలో కూడా ఇదే తరహా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటలీలోని భారత రాయబార కార్యాలయం కూడా సోమవారం ఇలాగే భారతీయులకు పలు సూచనలు జారీ చేసింది. నిరసనలకు, నిరసనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

