హరారే: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ను ఇండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మూడవ వన్డేలో కేఎల్ రాహుల్ సేన ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దాదాపు ఓటమి నుంచి బయటపడింది. అయితే ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్లు ఫుల్ ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ బీట్ కాలా చస్మా పాటకు చిందేశారు. దానికి సంబంధించిన వీడియోను ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. బార్ బార్ దేఖో చిత్రంలోని కాలా చస్మా సాంగ్కు ప్లేయర్లు అందరూ తమదైన స్టయిల్లో స్టెప్పులేస్తూ హంగామా చేశారు. ఆ వీడియో చూడాల్సిందే.