అహ్మదాబాద్: స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత ఆర్చర్లు రెండు స్వర్ణాలు సహా ఐదు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో తోమన్ కుమార్-శ్యామ్ సుందర్ స్వామి బంగారు పతకం గెలిచారు. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత ద్వయం 152-139తో ఇరాక్‌పై గెలిచింది. రికర్వ్ ఫైనల్లో హర్వీందర్ సింగ్-విజయ్ సుంది 6-2తో స్లొవేకియా జోడీపై గెలిచి విజేతగా నిలిచింది.
మహిళల రికర్వ్ ఫైనల్లో 0-6తో చైనా చేతిలో ఓడిన భావన-పూజ జంట రజతంతో సరిపెట్టగా.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ డబ్ల్యూ1 విభాగంలో స్వాతి-ఆదిల్ నజీర్ కూడా ఫైనల్లో ఓడి వెండి పతకం అందుకున్నారు. డబ్ల్యూ1 వ్యక్తిగత విభాగంలో స్వాతి 6-2తో రష్యా ఆర్చర్ ఎలెనా క్రుతోవాను ఓడించి కాంస్యం గెలిచింది. కానీ, మహిళల కాంపౌండ్ కాంస్య పతక పోరులో భారత స్టార్ ఆర్చర్లు శీతల్ దేవి-పాయల్ నాగ్ .. చైనా ద్వయం చేతిలో ఓడి పతకం కోల్పోయారు.