న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి రాకేశ్ మెహతా(74) నోయిడాలోని తన నివాసంలో సెప్టెంబర్ 6న ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన ఆరోగ్య, మానసిక సమస్యలను ప్రస్తావిస్తూ రాసిన ఒక నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. 1975 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి రాకేశ్ మెహతా.. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో పనిచేశారు.