ఫెడ్ఎక్స్ కొత్త సీఈవోగా భారతీయుడు
మరో దిగ్గజ సంస్థకు సారథిగా భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు. అమెరికా బహుళజాతి కొరియర్ డెలివరీ దిగ్గజం ఫెడ్ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా ఇండో-అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం ఎంపికయ్యారు.
- రాజ్ సుబ్రమణ్యం నియామకం
వాషింగ్టన్, మార్చి 29: మరో దిగ్గజ సంస్థకు సారథిగా భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు. అమెరికా బహుళజాతి కొరియర్ డెలివరీ దిగ్గజం ఫెడ్ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా ఇండో-అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం సంస్థ ప్రకటించింది. జూన్ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్నది. ప్రస్తుతం ఫెడ్ఎక్స్ కార్ప్ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా సుబ్రమణ్యం ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సీఈవోగా ఉన్న సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రెడెరిక్ డబ్ల్యూ స్మిత్ పదవీకాలం తీరిపోగానే సుబ్రమణ్యం ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్షుడిగా కూడా కొనసాగనున్నారు. మరోవైపు స్మిత్.. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారని ఓ తాజా ప్రకటనలో ఫెడ్ఎక్స్ తెలియజేసింది. 1991లో ఫెడ్ఎక్స్లో చేరిన సుబ్రమణ్యం.. అంచెలంచెలుగా ఎదిగారు. అమెరికా, కెనడా, ఆసియా దేశాల్లో అనేక బాధ్యతల్ని నిర్వర్తించారు. ఫెడ్ఎక్స్ అనుబంధ సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఫెడ్ఎక్స్ ఎక్స్ప్రెస్లో చీఫ్ మార్కెటింగ్-కమ్యూనికేషన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు, సీఈవోగా కూడా సుబ్రమణ్యం పనిచేశారు.
ఈ క్రమంలోనే 2020లో ఫెడ్ఎక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలోకి సుబ్రమణ్యం వచ్చారు. ఇకపైనా బోర్డులో ఆయన కొనసాగనున్నారు. కేరళకు చెందిన సుబ్రమణ్యం.. ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ చేశారు. టెక్సాస్ యూనివర్సిటీలో మార్కెటింగ్, ఫైనాన్స్లో ఎంబీఏ డిగ్రీని కూడా పొందారు. కాగా, 1971లో ఫెడ్ఎక్స్ను స్మిత్ నెలకొల్పారు. టెనెస్సీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల ఉద్యోగులున్నారు. నిరుడు సంస్థ రెవిన్యూ దాదాపు రూ.6.5 లక్షల కోట్లుగా ఉన్నది. మొత్తానికి ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్ తదితర ప్రముఖ సంస్థలకు సీఈవోలుగా భారతీయులున్న నేపథ్యంలో ఇప్పుడు రాజ్ సుబ్రమణ్యన్ వారి సరసన చేరినైట్టెంది.
‘మూడు దశాబ్దాలకుపైగా ఎన్నో బాధ్యతలను సుబ్రమణ్యం విజయవంతంగా నిర్వర్తించారు. ఆయన నాయకత్వంలో ఫెడ్ఎక్స్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించగలదు. కంపెనీ పరిపాలన, అంతర్జాతీయ విస్తరణ వంటి అంశాలపై సుబ్రమణ్యం ప్రధానంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నది’
-ఫ్రెడెరిక్ డబ్ల్యూ స్మిత్, ఫెడ్ఎక్స్ వ్యవస్థాపకుడు
‘ఫ్రెడెరిక్ స్మిత్ ఓ దూరదృష్టిగల నాయకుడు. వ్యాపార ప్రపంచంలో ఆయనో లెజెండ్. ప్రపంచంలోని గొప్ప సంస్థల్లో ఒకదాన్ని స్థాపించారు. అలాంటి సంస్థకు నాయకత్వ బాధ్యతలు రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. సంస్థ సర్వతోముఖాభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తాను’
-రాజ్ సుబ్రమణ్యం, ఫెడ్ఎక్స్ నూతన సీఈవో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

