Second ODI : మూడు వన్డేల సిరీస్‌లో అదిరే బోణీ కొట్టిన భారత జట్టు సిరీస్‌పై కన్నేసింది. తిరువనంతపురంలో 8 వికెట్ల విజయోత్సాహంతో జోరు మీదున్న టీమిండియా.. గువాహటి (Guwahati)లోనూ వెస్టిండీస్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. భారత గడ్డపై 24 ఏళ్లలో ఒక్క వన్డే సిరీస్ గెలవని విండీస్ పుంజుకోవాలని భావిస్తోంది. దాంతో.. రెండో మ్యాచ్ హోరాహోరీగా ఉండనుంది. బుధవారం జరుగనున్న ఈ మ్యాచ్ కోసం సోమవారం ఇరుజట్ల ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది గువాహటి చేరుకున్నారు.
స్వదేశంలో పంజా విసిరిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో ముందంజ వేసింది. తిరువనంతపురంలో విరాట్ కోహ్లీ(139 నాటౌట్), శుభ్‌మన్ గిల్(110) శతకమోతతో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. రెండో మ్యాచ్‌లోనూ ఇదే ఫలితం రాబట్టాలనుకుంటోంది.
India and West Indies arrive in Guwahati ahead of the second ODI ✈️ pic.twitter.com/hmsD6q6ui6
— Cricinfo (@cricinfo) September 28, 2026
బుధవారం రెండో వన్డే ఉన్నందున సోమవారం టీమిండియా, విండీస్ క్రికెటర్లు, కోచింగ్ సిబ్బంది గువాహటి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో పోగైన అభిమానులు ఇరుజట్ల ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం పలికారు. ఆపై బస చేసే హోటల్ సిబ్బంది సైతం అదిరిపోయేలా వెల్కమ్ చెప్పారు. టీమ్ బస్సులో వెళ్తుండగా ఫ్యాన్స్ పోటీపడి తమ అభిమాన క్రికెటర్లను కెమెరాలో బంధించారు.
వన్డే సన్నద్ధతలో భాగంగా మంగళవారం నెట్స్ ప్రాక్టీస్ ఉండనుంది. ఇండియాపై గత 24 ఏళ్లలో ఒక్క వన్డే సిరీస్ గెలుపొందని కరీబియన్ జట్టు.. శుభ్‌మన్ గిల్ సేనను నిలువరించడంపై దృష్టి సారించనుంది. సెప్టెంబర్ 30, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు బర్సపర క్రికెట్ స్టేడియంలో రెండో వన్డే మొదలవ్వనుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలున్నాయి. బౌలర్లకు కాస్త బౌన్స్ లభిస్తుందని సమాచారం. ఒకవేళ టీమిండియా బౌలింగ్ దళం భారీగా పరుగులిచ్చినా.. బ్యాటింగ్‌లో ధనాధన్ ఆటతో లక్ష్యాన్ని కరిగించే కోహ్లీ, గిల్.. ఉండగా విండీస్‌కు మరో సిరీస్ ఓటమి తప్పేలా లేదు.
🛬 𝗧𝗼𝘂𝗰𝗵𝗱𝗼𝘄𝗻 𝗶𝗻 𝗚𝘂𝘄𝗮𝗵𝗮𝘁𝗶!
The Indian men’s cricket team has landed in Guwahati ahead of its second ODI against the West Indies on September 30.
India comes into the tie with a 1-0 advantage in the three-match series.
📷 Ritu Raj Konwar#indiancricket… pic.twitter.com/8eZP5PZBV1
— Sportstar (@sportstarweb) September 28, 2026