IND vs NZ | వదలని వరుణుడు.. న్యూజిలాండ్, ఇండియా రెండో వన్డే రద్దు
మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఆతిథ్య జట్టు
IND vs NZ : ఇండియా, న్యూజిలాండ్ మధ్య హమిల్టన్‌లో జరుగుతున్న రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. రెండుసార్లు వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించాడు. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేద్దామనుకున్న భారత జట్టుకు నిరాశే మిగిలింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 4.5 ఓవర్ల ఆట తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌ని నిలిపి వేశారు. అప్పటికీ భారత్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులకు చేసింది.
వర్ష సూచన ఉండడంతో అంపైర్లు మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ధావన్ (3 పరుగులు) చేసి ఔట్ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడాడు. కానీ, 12.5 ఓవర్ల తర్వాత మళ్లీ చినుకులు మొదలలవ్వడంతో మ్యాచ్‌ని నిలిపి వేశారు. సూర్యకుమార్ యాదవ్ 34, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. వర్షం తగ్గే అవకాశం లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. మొదటి వన్డేలో విజయం సాధించిన న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే బుధవారం హగ్లే ఓవల్ స్టేడియంలో జరగనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

