న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌కు ఇచ్చే విదేశీ అభివృద్ధి సాయాన్ని భారత్ సగానికి (రూ.60 కోట్లకు) తగ్గించింది. పొరుగు దేశంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్న వేళ, ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం నిధుల కోత విధించడం గమనార్హం. ఆ దేశానికి చేసిన గత కేటాయింపుల్లోనూ వాస్తవంగా రూ.34.8 కోట్లే కేంద్రం ఖర్చు చేసింది.
మిగతా దేశాలకు అందించే సాయాన్ని నిరుడుతో పోలిస్తే ఈసారి యథాతథంగా ఉంచడమో, స్వల్పంగా పెంచడమో కేంద్రం చేసింది. ఈ సారి భారత్ నుంచి భూటాన్ అధిక ఆర్థిక సాయం పొందగా, తర్వాతి స్థానాల్లో నేపాల్, మాల్దీవులు, శ్రీలంక ఉన్నాయి. ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవుకు ఈ సారి బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు.