న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆదివారం బ్యాగేజ్ నిబంధనలను సవరించింది. సుంకం లేకుండా భారత్‌లోకి దిగుమతి చేసుకున్న వస్తువులపై పరిమితిని రూ. 50,000 నుంచి రూ.75,000కు పెంచింది. కొత్త బ్యాగేజ్ రూల్స్‌ను ఆదివారం నోటిఫై చేసింది. ఇవి ఫిబ్రవరి 2 అర్థరాత్రి నుంచి అమలవుతాయి.
కొత్త నిబంధనల ప్రకారం భారత పౌరుడు, లేదా భారత్‌ను సందర్శించే పర్యాటకుడు 75 వేల రూపాయల విలువైన వస్తువులను తీసుకు రావచ్చు. వాటికి ఎలాంటి కస్టమ్స్ సుంకాలు విధించరు. దశాబ్దాల నుంచి అమలవుతున్న నిబంధనల ప్రకారం ఇప్పటివరకు ఈ పరిమితి రూ.50,000 ఉండేది.