న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రధాని మోదీ(PM Modi) స్పందిస్తూ.. భారత్ తటస్థంగా లేదు అని, తాము శాంతి వైపు ఉన్నామని అన్నారు. ఢిల్లీలో శుక్రవారం హైదరాబాద్ హౌజ్‌లో పుతిన్‌తో జరిగిన సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చర్చల, దౌత్యం ద్వారా ఉక్రెయిన్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టాలని మోదీ పేర్కొన్నారు. ఆ సంక్షోభానికి శాంతియుత పరిష్కారాన్ని ఆశిస్తున్నామని, దానికే తమ మద్దతు ఉంటుందని ప్రధాని తెలిపారు. అయితే మోదీ వ్యాఖ్యలకు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని పుతిన్ తెలిపారు.
#WATCH | In his meeting with Russian President Vladimir Putin, PM Narendra Modi says, “Whenever I had an interaction with the world leaders, in detailed discussions, I always said that India is not neutral. India has a side and that side is of peace. We support all efforts for… pic.twitter.com/mYwZQC3Pk6
— ANI (@ANI) December 5, 2025
శాంతి మార్గంలోనే ప్రపంచ సంక్షేమం ఉందన్నారు. కలిసికట్టుగా శాంతి కోసం మార్గాలు అన్వేషించాలన్నారు. గత కొన్ని రోజులుగా ఆ దిశగా చర్యలు జరుగుతున్నాయని, తనకు విశ్వాసం ఉందని, ప్రపంచంలో మళ్లీ శాంతి వికసిస్తుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య ఉన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అమెరికా కూడా ప్రయత్నాలు చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంపిన దౌత్యవేత్త విట్కాఫ్ కూడా కొన్ని రోజుల క్రితం పుతిన్‌తో చర్చలు జరిపారు.