భువనేశ్వర్: హాకీ ప్రో లీగ్ మ్యాచ్‌లకు అమిత్ రోహిదాస్ సారథ్యం వహించనున్నాడు. ఏప్రిల్ 2, 3న ఇంగ్లండ్‌తో జరుగనున్న రెండు మ్యాచ్‌లకు జట్టు కెప్టెన్‌గా అమిత్‌ను హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌సింగ్ వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌లకు 22 మందితో ప్రకటించిన జట్టులో డిఫెండర్ నీలమ్ సంజీప్కు స్థానం దక్కింది. నిరుడు ఢాకా వేదికగా జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో నీలమ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇటీవల రోహిదాస్ సారథ్యంలో టీమ్ఇండియా అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఒకటి ఓడిపోగా.. రెండోది గెలిచింది. దక్షిణాఫ్రికాపై రెండింటిని గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికా, స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఒకటి నెగ్గి.. మరొకటి ఓడిపోయింది. ఈ లీగ్ పాయింట్ల పట్టికలో జర్మనీ (17) తర్వాత 16 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది.