న్యూఢిల్లీ: సాధారణంగా జీతం ఎప్పుడు వస్తుంది..? నెలకోసారి వస్తుంటుంది. అంతేకదా.. అయితే వారానికోసారి జీతం వస్తే ఎలా ఉంటుంది? నెల రోజుల వరకు జీతం కోసం ఎదురు చూడాల్సిన పని ఉండదు కదా.. ఇండియామార్ట్ అనే బీ2బీ ఈ-కామర్స్ కంపెనీ తన ఉద్యోగులకు ఇలాగే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. భారత్లోనే ఈ నిర్ణయం తీసుకున్న తొలి సంస్థగా ఇండియామార్ట్ రికార్డులకు ఎక్కనుంది.
ఎందుకీ నిర్ణయం?
ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చెబుతున్నది. వారానికోసారి చెల్లింపులతో ఉద్యోగుల ఆర్థిక అవసరాలను సులువుగా తీర్చుకోవచ్చని, వారిపై ఆర్థిక భారం తగ్గుతుందని వివరించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, అమెరికాలో చాలా వరకు వారానికోసారి జీతం చేస్తుంటారు. అయితే ఈ ప్రక్రియ వల్ల చెల్లింపులు, హెచ్ఆర్ వంటి విభాగాలపై అదనపు భారం పడుతుందని కొందరు చెబుతున్నారు.