అజేయంగా సెమీస్‌కు.. భారత్ ఖాతాలో ఐదో విజయం
సొంతగడ్డపై జరుగుతున్న హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న భారత జట్టు ఖాతాలో మరో విజయం.
జలంధర్: సొంతగడ్డపై జరుగుతున్న హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న భారత జట్టు ఖాతాలో మరో విజయం. లీగ్ దశలో భాగంగా సోమవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్.. 8-0తో దక్షిణ కొరియాను చిత్తుచేసి అజేయంగా సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో మొదట బంగ్లాదేశ్‌పై 13-0తో టైటిల్ వేటను ఆరంభించిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఆ తర్వాత చైనా, జపాన్, మలేషియాపై విజయాలు నమోదుచేసింది.
కొరియాతో పోరులో స్ట్రైకర్ దిల్‌ప్రీత్ సింగ్ (8, 40వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా జుగ్రాజ్ సింగ్ (11), హర్మన్‌ప్రీత్‌సింగ్ (15), షీలానంద్ (33), సుఖ్జీత్ (34), సంజయ్ (36), అంగద్ (60) చెరో గోల్స్‌తో చెలరేగారు. లీగ్ స్టేజ్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచిన భారత్.. పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం జరుగబోయే రెండో సెమీస్‌లో కొ రియాతోనే భారత్ నాకౌట్ మ్యాచ్ ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

