ఢాకా : బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రహమాన్ చారిత్రక నివాసంపై బుధవారం మూక దాడి జరిగింది. దుండగులు ఈ బంగళాకు నిప్పు పెట్టి, విధ్వంసం సృష్టించారు. పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ పేజ్లో భావోద్వేగంతో స్పందించారు. బంగళాను తుడిచిపెట్టేసినప్పటికీ, తన తండ్రి చరిత్ర ఎన్నటికీ తుడిచిపెట్టుకుపోదని స్పష్టం చేశారు. ఓ ఇంటిని చూసి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. గతంలో ఈ ఇంటికి నిప్పు పెట్టారని, ఇప్పుడు పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని ఆవేదన చెందారు.