WTC | మెల్బోర్న్: వరుసగా రెండుసార్లు ఫైనల్, గద గెలవకున్నా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాం. నిన్నా మొన్నటిదాకా పాయింట్ల పట్టికలో అగ్రస్థానం. మరో రెండు మ్యాచ్‌లు గెలిచుంటే ఇప్పటికీ ఏ ఆందోళన లేకుండా హాయిగా లార్డ్స్‌కు టికెట్ బుక్ చేసుకునేవాళ్లమే. కానీ స్వదేశంలో కివీస్ చేతిలో అవమానకర క్లీన్‌స్వీప్‌కు తోడు ఆసీస్ పర్యటనలో ఓటములు.. మెల్‌బోర్న్‌లోనూ అదే కథ. ఇంకేముంది! డబ్ల్యూటీసీలో భారత అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి.