బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్ కప్‌లో ఐదుగురు భారత బాక్సర్లు పతకాలు ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ బౌట్లలో గుంజన్ (48 కిలోలు), జయశ్రీ దేవి (54 కి.), చంద్రిక పుజారి (51 కి.),రాధామణి (57 కి.) తమ ప్రత్యర్థులను చిత్తుచేసి సెమీస్‌కు చేరుకోవడంతో వీరికి పతకం ఖాయమైంది.