ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా భారత్

ఖైరతాబాద్, డిసెంబర్ 6: వైద్య రంగంలో భారత్ స్వ యం సంవృద్ధి సాధించి ప్రపంచలోనే ప్రత్యేక స్థానం సం తరించుకున్నదని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా 65 వార్షికోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం కళాశాల క్యాంపస్‌లో జరిగాయి. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళి సై వర్చువల్ వేదికగా ప్రసంగించారు. కొవిడ్ 19వ శతాబ్దపు అత్యంత ఘోరమైన సంక్షోభమని అభివర్ణించారు. అన్ని రంగాలను ఈ మహమ్మారి ప్రభావితం చేసిందన్నా రు. దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భారతీయ వైద్య రంగం విజయం సాధించిందన్నారు. వ్యాక్సినేషన్లోనూ 126 కోట్ల డోసులు విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు.
రెండో దశను త్వరగా అధిగమించి దేశం గొ ప్ప పునరాగమనాన్ని సాధించి ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరిచిందన్నారు. గతంలో పీపీఈ కిట్లను దిగుమతి చేసుకునే వారమని, నేడు వాటిని ఎగుమతి చేయడంలో రెం డో స్థానంలో ఉన్నామన్నారు. ప్రధాని మోది ప్రత్యేక చొరవతో వైద్య రంగంలో స్వయం సంవృద్ధి సాధించామన్నా రు. వచ్చే ఏడాది నాటికి భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగం విలువ 372 బిలియన్ యూఎస్ డాలర్లకు పెరుగుతుందన్నారు.
వైద్య వస్తువుల ఎగుమతిలో దేశంలో 12వ స్థానంలో ఉందని, 200లకు పైగా దేశాలకు మందులను ఎగుమతి చేస్తున్నామన్నారు. మెడికల్ టూరిజంలో భారత్ ప్రపంచంలోని టాప్ 5లో స్థానం దక్కించుకుందన్నారు. ఆస్కీ గురించి మాట్లాడుతూ దేశం ఎక్స్‌పీరియ న్స్ మేనేజ్మెంట్ ఎడ్యూకేషన్‌లో ప్రసిద్ధి చెందిందని, కా ర్పొరేట్ మేనేజర్లు, వ్యవస్థాపకులు, విద్యావేత్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఖ్యాతిని సంపాదించుకుంటుదన్నారు. కార్యక్రమంలో ఆస్కీ డైరెక్టర్ జనరల్, ప్రొ॥ నిర్మల బా గ్చీ, కోర్ట్ గవర్నర్స్ చైర్మన్ పద్మనాభయ్య పాల్గొన్నారు.
దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాలు :గవర్నర్
హైదరాబాద్: సాయుధ దళాల పతాక దినోత్సవం సం దర్భంగా వీర నారీమణులు, దివ్యాంగ సైనికులు, మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులందరికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ధ సమయాల్లో దేశ సమగ్రతను కాపాడటానికి మన సాయు ధ దళాలు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాయన్నారు. మాతృభూమి భద్రత కోసం అత్యున్నత త్యాగం చేసిన సాయుధ బలగాలకు ప్రజలు నివాళులర్పించి సంఘీభావం తెలిపే సందర్భం ఇదని గవర్నర్ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

