వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు తడబడుతున్నారు. షాయి హోప్ (27), బ్రాండన్ కింగ్ (18), డారెన్ బ్రావో (1), నికోలస్ పూరన్ (9), జేసన్ హోల్డర్ (2)ను తక్కువ స్కోర్లకే అవుట్ చేసిన భారత బౌలర్లను.. షార్మా బ్రూక్స్ (44) అడ్డు నిలబడి ఎదుర్కొన్నాడు. అతనికి అకీల్ హొస్సేన్ (31 నాటౌట్) మంచి సహకారం అందించాడు. చివరకు దీపక్ హుడా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. బ్రూక్స్‌ను పెవిలియన్ చేర్చాడు.
అయితే అకీల్ హొస్సేన్, ఫాబియాన్ అలెన్ ఇద్దరూ కూడా భయపడకుండా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే విండీస్ జట్టు 39 ఓవర్లలో 159/7 స్కోరుతో నిలిచింది. భారత బౌలర్లు మళ్లీ పుంజుకొని పట్టుబిగించకపోతే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో సిరాజ్ బౌలింగ్‌లో హొస్సేన్ షాట్ కొట్టగా అది గాల్లోకి లేచింది.
అయితే దాన్ని అందుకోవడంలో వాషింగ్టన్ సుందర్ విఫలమయ్యాడు. ఆ వెంటనే ఫాబియన్ అలెన్ (13)ను సిరాజ్ అవుట్ చేశాడు. అతను వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడటానికి అలెన్ ప్రయత్నించాడు. ఈ సమయంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ పంత్‌కు నేరుగా వెళ్లింది. దాన్ని అందుకున్న పంత్.. అలెన్ ఇన్నింగ్స్ ముగించాడు.