WI v Ind 1st ODI | భారత్, వెస్టిండీస్ (Wi vs Ind) జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్(ODI Series) కు సిద్ధమయ్యాయి. గురువారం ఇరు జట్ల మధ్య తొలి పోరు (1st ODI) జరుగనుంది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి సమయం దగ్గర పడుతున్న వేళ టీమ్ఇండియా ప్రతీ మ్యాచ్‌ను కీలకంగా భావిస్తున్నది. విండీస్‌తో సిరీస్ ద్వారా రానున్న ఆసియా కప్, వరల్డ్‌కప్ టోర్నీకి ఎలాంటి ప్రణాళికలు ఎంచుకోవాలో చూస్తున్నది. అయితే ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్పై క్రికెట్ అభిమానులకు డీడీ స్పోర్ట్స్ (DooraDarshan Sports) శుభవార్త తెలిపింది.
ఈ మ్యాచ్‌ను ఓటీటీ వేదికగా సాయంత్రం 6 గంటల నుంచి జియో సినిమా (Jio Cinema) ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది. అయితే జియో సినిమా కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కామెంట్రీ మాత్రమే అందిస్తుండగా.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు.. తెలుగు, కన్నడ, తమిళ్, భోజ్‌పురి, బెంగాలి భాషల్లో డీడీ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు దూరదర్శన్ ప్రకటించింది. ఇక తెలుగులో కామెంట్రీ కోసం డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి అందుబాటులో ఉన్నాయని దూరదర్శన్ స్పోర్ట్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్ కీలక సిరీస్‌కు సిద్ధమైంది. స్వదేశం వేదికగా మెగాటోర్నీ సమీపిస్తున్న వేళ అందుబాటులో ఉన్న మ్యాచ్‌ల ద్వారా జట్టుపై ఓ అంచనాకు వచ్చేందుకు టీమ్ఇండియా ప్రణాళికలు రచిస్తున్నది. టెస్టు సిరీస్ గెలుపు జోరును వన్డేల్లోనూ కొనసాగిస్తూ వెస్టిండీస్‌పై పైచేయి సాధించాలని చూస్తున్నది. మరోవైపు వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేపోయిన విండీస్.. సొంతగడ్డపై సత్తాచాటాలని చూస్తున్నది. షిమ్రాన్ హిట్మైర్, ఓషానె థామస్ తిరిగి జట్టులోకి రావడం ఆ జట్టుకు బలం లాభించే అవకాశముంది. వీరికి తోడు షాయి హోప్, రోవ్‌మన్ పావెల్ రాణిస్తే.. విండీస్ గట్టేక్కినట్లే.
MATCH DAY!
🏏 1st ODI – #WIvIND ⏰ 6 PM onwards…
Live The Game on DD Sports 📺#TeamIndia #WIvIND #MenInBlue pic.twitter.com/x5rN1uW3zX
— Doordarshan Sports (@ddsportschannel) July 27, 2023