IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
IND vs NZ 2nd ODI | న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ను 50 ఓవర్లకు బదులుగా 47 ఓవర్లకు కుదించారు
IND vs NZ 2nd ODI | న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ను 50 ఓవర్లకు బదులుగా 47 ఓవర్లకు కుదించారు. దీంతో ఇరు జట్లు ఒక్కో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లు ఆడనున్నాయి.
వెల్లింగ్టన్లోని హెచ్ఎన్ఆర్ఐ స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌కు తొలుత భారీ వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ ఆలస్యమైంది. వర్షం తగ్గిన తర్వాత అంపైర్లు మైదానాన్ని పరిశీలించి మ్యాచ్ నిర్వహణకు అనుమతించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.35 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 8.05 గంటలకు) టాస్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకు) మ్యాచ్ ప్రారంభం కానుంది.
పిచ్‌పై తేమ.. బౌలింగ్‌కే మొగ్గు
వర్షం కారణంగా పిచ్‌పై తేమ ఎక్కువగా ఉండటంతో శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పిచ్‌పై చేతితో రుద్ది తేమను పరిశీలించిన గిల్.. పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉండొచ్చని భావించాడు. కొత్త బంతితో స్వింగ్ లభించే అవకాశాలు ఉండటంతో న్యూజిలాండ్ బ్యాటర్లకు ఆరంభంలో సవాల్ ఎదురుకానుంది.
సిరాజ్ వస్తాడా?
అనుభవం లేని బౌలింగ్ విభాగంతో బరిలోకి దిగినప్పటికీ.. గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్, అర్ష్‌దీప్ సింగ్ తొలి వన్డేలో కివీస్ బ్యాటర్లను భయపెట్టారు. టెస్టు మ్యాచ్ లెంగ్త్‌తో తొలి మ్యాచ్‌లో ఏకంగా 46 డాట్ బాల్స్ వేసి మెరిసిన కాంబోజ్‌కు ఈసారి కొత్త బంతితో బౌలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. భారత్-ఏ తరఫున అనధికార టెస్టు సిరీస్ ముగించుకొని సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టుతో కలిశాడు. తొలి మ్యాచ్‌లో వికెట్ దక్కించుకోలేకపోయిన ఆకిబ్ నబీ స్థానంలో తను బరిలోకి దిగొచ్చు.
అయితే ఈ విషయంపై యాజమాన్యం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆక్లాండ్ ఈడెన్ పార్క్ లో స్ట్రెయిట్ బౌండరీలు చిన్నవిగా ఉండగా, వెల్లింగ్టన్లో స్క్వేర్ బౌండరీలు చిన్నవిగా ఉంటాయి. ఇక్కడి పిచ్‌పై కూడా మంచి క్యారీ, బౌన్స్ లభించనుండటంతో భారత పేసర్లు బంతిని మరింత ఫుల్లర్ లెంత్‌లో వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇక ఆక్లాండ్‌లో చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో కింగ్ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్ జట్టు సునాయాస విజయాన్ని అందుకున్నా.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటవ్వడం కాస్త ఆందోళన కలిగించే అంశం. తను వెంటనే ఫామ్‌లోకి రావాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కోహ్లీ ఎంతో సులువుగా పరుగులు రాబట్టినా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ షార్ట్ బాల్స్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వెల్లింగ్టన్ బౌన్సీ పిచ్‌పై మరింత సవాల్ విసిరే షార్ట్ బాల్ పరీక్షను ఈ ఇద్దరూ సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కివీస్‌కు మరో దెబ్బ
న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతోంది. ప్రాక్టీస్ సమయంలో మ్యాట్ హెన్రీని ఢీకొన్న కారణంగా స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే కంకషన్‌కు గురై ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కాన్వే స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ నిక్ కెల్లీని జట్టులోకి తీసుకున్నారు. అయితే, తల గాయంతో ఇబ్బంది పడిన మ్యాట్ హెన్రీ కోలుకుని మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం కివీస్ బౌలింగ్‌కు కాస్త ఊరటనిచ్చే అంశం.
తొలి పోరులో న్యూజిలాండ్ బ్యాటర్లు తేలిపోయారు. షార్ట్ బాల్స్ నుంచి పుల్ షాట్లతో బయటపడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. భారత పేసర్లు రాబట్టిన అదనపు బౌన్స్‌కు ఆతిథ్య బ్యాటర్ల వద్ద సమాధానం కరువైంది. చల్లటి వాతావరణంలో ఈ మైదానంలోనూ మంచి బౌన్స్ లభించనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌క్యాప్స్ బ్యాటింగ్ యూనిట్ మెరుగైన ప్రదర్శన చేసి బంతితోనూ మెప్పిస్తేనే కివీస్ సిరీస్‌ను సమం చేయగలదు.
తుది జట్లు (అంచనా):భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయస్, అక్షర్ , రాహుల్ (కీపర్), నమన్ , కాంబోజ్, నబీ/సిరాజ్, బ్రార్, అర్ష్‌దీప్ .
న్యూజిలాండ్: సిఫర్ట్, విల్ యంగ్, నికోల్స్, డారిల్ మిచెల్, లేథమ్ (కీపర్), గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్ (కెప్టెన్), నేథన్ స్మిత్, జేమీసన్, డఫీ/ హెన్రీ, టిక్నర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

