Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలను 2027 ఫిబ్రవరి 24 నుంచి, ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ సారి ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్స్ సైతం నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
Inter Exams | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలను 2027 ఫిబ్రవరి 24 నుంచి, ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ సారి ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్స్ సైతం నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
ఫీజు కట్టింది 10 శాతమే..
ఇంటర్ ఎగ్జామ్ ఫీజు ఇప్పటి వరకు 10% విద్యార్థులు మాత్రమే చెల్లించారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 9తో ముగియనున్నది. ఆ తర్వాత రూ. 100తో ఈ నెల 21, రూ. 500 ఆలస్య రుసుముతో ఈ నెల 30, రూ. వెయ్యి ఆలస్య రుసుముతో డిసెంబర్ 8, రూ. 2 వేల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించే అవకాశముంది. ఇంటర్ పరీక్షలకు కొత్త నామినల్ రోల్, ఇంటర్నల్ అసెస్మెంట్ కోడ్స్, ప్రాక్టికల్ పరీక్షల కోడ్స్‌ను ఇంటర్ విద్యామండలి కేటాయించింది. సబ్జెక్టులవారీగా ఇంటర్నల్ అసెస్మెంట్ కోడ్స్ కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది.
13 వరకు ఇంటర్ అడ్మిషన్లు
ఇంటర్ అడ్మిషన్లకు ఈ నెల 13 వరకు అవకాశం కల్పించింది. రూ. వెయ్యి ఆలస్య రుసుముతో ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ కాలేజీల్లో ఆలస్య రుసుము తీసుకోరు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

