Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హౌస్‌లో రివార్డ్స్ అండ్ రివెంజ్ టాస్క్‌తో పాటు కెప్టెన్సీ పోటీ కూడా రసవత్తరంగా సాగింది. ఒకవైపు ఫుడ్ విషయంలో త్రిగుణ్, వర్షిణి మధ్య గొడవ జరగగా.. మరోవైపు వర్షిణి కోసం ముకేశ్ త్రిగుణ్‌తో వాదనకు దిగాడు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హౌస్‌లో రివార్డ్స్ అండ్ రివెంజ్ టాస్క్‌తో పాటు కెప్టెన్సీ పోటీ కూడా రసవత్తరంగా సాగింది. ఒకవైపు ఫుడ్ విషయంలో త్రిగుణ్, వర్షిణి మధ్య గొడవ జరగగా.. మరోవైపు వర్షిణి కోసం ముకేశ్ త్రిగుణ్‌తో వాదనకు దిగాడు. ఇక ఫ్యామిలీ వీక్‌లో కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కోసం జరిగిన పోటీలో వర్షిణి కీలక త్యాగం చేసింది. చివరకు వంశీ కొత్త కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. హౌస్‌లో ఆహారం వృథా అవుతోందనే కారణంతో త్రిగుణ్, వర్షిణిపై అసహనం వ్యక్తం చేశాడు. ఆమె ఫుడ్ వేస్ట్ చేస్తోందని భావించిన త్రిగుణ్.. వర్షిణికి టీ లేకుండా శిక్ష విధించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ విషయంలో వర్షిణికి మద్దతుగా నిలిచిన ముకేశ్.. త్రిగుణ్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో హౌస్‌లో మరోసారి వాతావరణం వేడెక్కింది.
ఇక బిగ్‌బాస్ నిర్వహించిన రివార్డ్స్ అండ్ రివెంజ్ టాస్క్‌లో విజయం సాధించిన వారికి వచ్చే వారం తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కల్పించారు. అయితే రివెంజ్‌కు గురైన ఆర్కే, అమన్, వర్షిణి, ముకేశ్‌లకు మొదట ఈ అవకాశం దక్కలేదు. అయినప్పటికీ వారికి బిగ్‌బాస్ మరో చివరి అవకాశం ఇచ్చారు.ఆర్కే, అమన్ ఒక జంటగా.. వర్షిణి, ముకేశ్ మరో జంటగా ఏర్పడ్డారు. ఈ రెండు జంటల మధ్య ప్రత్యేక టాస్క్ నిర్వహించారు. ఇందులో విజయం సాధించిన జంటలో ఒక్కరికి మాత్రమే కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఉంటుందని బిగ్‌బాస్ స్పష్టం చేశారు.
ఈ టాస్క్‌లో ఒకరు స్టాండ్‌ను బ్యాలెన్స్ చేస్తూ పట్టుకోవాలి. మరొకరు ఇటుకలతో ఇంటి ఆకారాన్ని నిర్మించాలి. ముందుగా ఈ ప్రక్రియను పూర్తి చేసిన జంట విజేతగా నిలుస్తుంది. ఈ పోటీలో ముకేశ్, వర్షిణి ముందుగా టాస్క్ పూర్తి చేశారు. అయితే వారు ఎక్కువ సమయం స్టాండ్‌ను బ్యాలెన్స్ చేయలేదని, ఇల్లు త్వరగా కూలిపోయిందని అమన్, ఆర్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు సంచాలకుడిగా వ్యవహరించిన నరేష్ మాత్రం ముకేశ్, వర్షిణి విజయం సాధించినట్లు ప్రకటించాడు. దీంతో తమకు అన్యాయం జరిగిందని భావించిన అమన్, ఆర్కే నరేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నరేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన నిర్ణయంలో తప్పు ఉంటే శనివారం తానే శిక్ష అనుభవిస్తానంటూ గట్టిగా చెప్పాడు.
ఇక విజేతలుగా నిలిచిన ముకేశ్, వర్షిణిలలో ఎవరు తమ కుటుంబ సభ్యులను కలుసుకోవాలనే ప్రశ్న ఎదురైంది. ఈ సమయంలో వర్షిణి పెద్ద మనసు చేసుకుంది. తనకు వచ్చిన అవకాశాన్ని ముకేశ్‌కు త్యాగం చేసింది. దీంతో ముకేశ్‌కు కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం దక్కింది. మరోవైపు హౌస్‌లో కెప్టెన్సీ పోటీ కూడా జరిగింది. ఈసారి కెప్టెన్సీ కంటెండర్లుగా త్రిగుణ్, దేబ్జానీ, శ్వేత, వంశీ పోటీపడ్డారు. ఈ నలుగురిలో వంశీకి ఎక్కువ మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో అతడు విజయం సాధించి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aman
- bigg boss 10
- captain
- naresh
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

