అబుధాబి: క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే తమకంటూ పేరు సంపాదించుకుంటున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై టీమిండియా ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కేఎల్ రాహుల్ (18 నాటౌట్), రోహిత్ శర్మ (34 నాటౌట్) అద్భుతమైన ఆరంభాన్నందించారు.
ఆఫ్ఘన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న వీరిద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్లేమీ కోల్పోకుండా 53 పరుగులు చేసింది.