హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సంబంధించిన మెస్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గురుకులా లు, హాస్టళ్లలోని మొత్తంగా 8 లక్షల 50వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.