ఎస్తేర్ నోరోన్హా, అజయ్ జంటగా దర్శకుడు పి సునీల్‌కుమార్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా ‘#69 సంస్కార్ కాలనీ’. లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకాలపై బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 18న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర నాయిక ఎస్తేర్ నోరోన్హా మాట్లాడుతూ..‘ఈ చిత్రంలో వైశాలి పాత్రలో నటిస్తున్నాను. విలాసవంతమైన జీవితాన్ని కోరుకునే మధ్యతరగతి గృహిణి పాత్ర నాది. తన ఆలోచనా విధానంలో బలమైన మహిళ అనిపిస్తుంది. గొప్పగా ఉండాలనే కోరికలతో ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది సినిమాలో చూస్తారు. ఈ చిత్రంలో ఒక పాట కూడా పాడాను. సందేశం, కమర్షియాలిటీ కలిసిన చిత్రమిది’ అని చెప్పింది.