న్యూఢిల్లీ : ఆధునిక జీవితంలో మనిషి నిత్యం ఒత్తిడితో చిత్తవుతున్నాడు. ఒత్తిడిని వీడి సంతోషంతో ఉంటే ఆరోగ్యం సహా మెరుగైన జీవితం సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్న మాట. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారని అయితే మీ సంతోషం కోసం మీరు ఇతరులపై ఆధారపడకూడదని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా చెబుతున్నారు.
వారంలో తొలి రోజు మెరుగ్గా ప్రారంభం కాకపోయినా కుంగుబాటుకు లోనవరాదని, మీరు సంతోషంగా ఉండే మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. 64 ఏండ్ల పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయంకా తాజా పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
హ్యాపీ నెస్ ఈజ్ యాన్ ఇన్సైడ్ జాబ్ అంటూ గ్రాఫిక్ ఇమేజ్ను గోయంకా షేర్ చేశారు. హర్ష్ గోయంకా వెలిబుచ్చిన వ్యాఖ్యలతో నెటిజన్లు పూర్తిగా ఏకీభవించారు. ఇక విజయానికి మీరు చెప్పిందే కీలకమని మరి కొందరు నెటిజన్లు రాసుకొచ్చారు.
Happiness is an inside job….. pic.twitter.com/Z6vqwerD04
— Harsh Goenka (@hvgoenka) October 10, 2022