పాట్నా: బీహార్లో కల్తీ మద్యం మరణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల భగల్పూర్, గోపాల్గంజ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 16 మంది మరణించగా.. తాజాగా మరో నాలుగు జిల్లాల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మధేపూరాలో ముగ్గురు, బాంకాలో 10 మంది, భగల్పూర్లో నలుగురు, మురళీగంజ్లో ఒకరు మరణించినట్టు పోలీసులు చెప్పారు.