న్యూఢిల్లీ : కూతురికి ప్రతిరోజూ జుట్టును దువ్వి స్కూల్‌కు పంపేందుకు రెడీ చేసే తండ్రి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఫైజెన్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పేర్ చేయగా ఇప్పటివరకూ 5 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి తన కూతురిని స్కూల్‌కు రెడీ చేస్తుండటం కనిపిస్తుంది.
This Dad combs his daughter's hair every morning. 💞 pic.twitter.com/7OxnD5nOsK
— Figen (@TheFigen_) November 8, 2022
జుట్టు దువ్వడం నుంచి వివిధ రకాల హెయిర్ స్టైల్స్‌తో చిన్నారిని తీర్చిదిద్దడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రోజూ బాలికను ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలని అడుగుతుంటాడు. ఈ తండ్రి ప్రతి రోజూ తన కూతురి జుట్టు దువ్వుతుంటాడని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియో అమూల్యమైనదని తండ్రీ కూతుళ్ల అనుబంధానికి సంకేతమని పలువురు యూజర్లు రాసుకొచ్చారు.