Mahendragiri Varahi | 150 ఏళ్ల మిస్టరీ.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్
Mahendragiri Varahi | టాలీవుడ్ నటుడు సుమంత్ హీరోగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi) సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ గ్రాండ్‌గా విడుదలైంది.
Mahendragiri Varahi | టాలీవుడ్ నటుడు సుమంత్ హీరోగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi) ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు.
పరమశివుడి ఆజ్ఞతో మహేంద్రగిరిలో కొలువుదీరిన గ్రామదేవత ‘వారాహి మాత’ నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. మహేంద్రగిరి రాజకుటుంబానికి చెందిన వారు గత 150 ఏళ్లుగా అనుమానాస్పద స్థితిలో వరుసగా మరణిస్తుండటం, ఇదంతా అమ్మవారి శాపం వల్లే జరుగుతోందనే నమ్మకం చుట్టూ ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆ రహస్యాన్ని ఛేదించేందుకు హీరో సాహసించే తీరు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో వారాహి మాతగా నటి ఐశ్వర్య రాజేష్ అలరించనుండగా, ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ ఒక కీలక పాత్రలో ట్రైలర్లో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అంచనాలను అమాంతం పెంచేశారు. వీరితో పాటు మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌ను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11, 2026న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

