The Paradise | నాని ‘ది ప్యారడైజ్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ‘యెష నాగుల’ సాంగ్ విడుదల!
Yesha Nagula | నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ను అందించారు.
Yesha Nagula | నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ను అందించారు. ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌గా మోస్ట్ పాపులర్ ఫోక్ సాంగ్ అయిన ‘యెష నాగుల కట్ట మీద’ పాటను డిజిటల్ వేదికగా విడుదల చేశారు.
తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించేలా సాగే ఈ జానపద గీతాన్ని సినిమాలో మరింత మాస్ వైబ్‌తో రీమిక్స్ వెర్షన్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ, ప్రజల నోళ్లలోనూ నానుతున్న ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ అందించిన రాకింగ్ మాస్ బీట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నానితో పాటు తెరపై ఈ పాటకు రాబోయే మాస్ స్టెప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చుతున్నాయి. ఈ క్యాచీ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, జంగి రెడ్డి మరియు సింగర్ ప్రభ తమ శక్తివంతమైన గాత్రంతో ప్రాణం పోశారు. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24, 2026న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Instant BANGER #YeshaNagula 🔥💯🤙🤙🤙🤙#TheParadise pic.twitter.com/FH7w86x9je
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 29, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

