ప్రతి యువతి జీవితంలో వివాహం ఓ స్పెషల్ ఈవెంట్‌గా నిలిచిపోతుంది. తమ కూతురికి పెండ్లి వేడుకను ప్రత్యేకంగా మలిచేందుకు కుటుంబసభ్యులు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టరు. ఓ తండ్రి తన కూతురి ప్రత్యేకమైన రోజును తన డ్యాన్స్‌తో మరింత స్పెషల్‌గా మార్చారు.
యువతి పెండ్లి వేడుకలో తండ్రీ కూతుళ్ల డ్యాన్స్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందంగా ముస్తాబైన పెండ్లి కూతురు తన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంటే తన కూల్ స్టెప్స్‌తో తండ్రి అలరించాడు.
ఈ వీడియోకు ఇప్పటివరకూ 3.4 కోట్ల వ్యూస్ లభించాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో బ్రిటనీ రెవెల్ పోస్ట్ చేశారు. ఈ వైరల్ వీడియోలో వధువు వెడ్డింగ్ గౌన్‌లో మెరిసిపోతూ తండ్రితో కలిసి డ్యాన్స్ చేస్తుండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.